: పూనమ్ పాండే హాట్ యోగా....యూ ట్యూబ్ వీడియోకు 3 రోజుల్లో 20 లక్షల క్లిక్స్!
సంచలనాలకు కేంద్ర బిందువైన మోడల్ పూనమ్ పాండే యోగా పాఠాలు చెబుతోంది. మొన్నటి ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా విశ్వవ్యాప్తంగా జనం యోగాసానాల బాట పట్టారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు కోట్లాది మంది యోగాపై ఆసక్తి పెంచుకున్నారు. యోగా అంటే తనకూ మక్కువేనని చెప్పుకున్న పూనమ్, ‘హాట్ యోగా’ పేరిట ఓ వీడియోను యూట్యూబ్ లో పెట్టేసింది. ఈ వీడియోను యువత విరగబడి చూస్తోంది. కేవలం మూడంటే మూడు రోజుల్లో ఈ వీడియోను 20 లక్షల మంది వీక్షించారు.