: తిరుమల ఘాట్ లో బోల్తాపడ్డ జీపు... 10 మందికి గాయాలు
తిరుమల కొండపై ఉన్న పాపవినాశం ఘాట్ రోడ్డులో కొద్దిసేపటి క్రితం రోడ్డు ప్రమాదం సంభవించింది. పాపవినాశం వద్దకు భక్తులను తీసుకువెళుతున్న ఓ జీపు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో పది మంది భక్తులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను టీటీడీ సిబ్బంది హుటాహుటిన తిరుమల కొండపై ఉన్న అశ్విని ఆస్పత్రికి తరలించారు. ఇదిలా ఉంటే, అతి వేగం కారణంగానే జీపు బోల్తా పడ్డట్లు తెలుస్తోంది. ప్రమాదంలో గాయపడ్డవారంతా తెలంగాణలోని ఆదిలాబాదు జిల్లాకు చెందిన వారుగా గుర్తించారు.