: చంద్రబాబుకు జైలు కూడు తప్పదు... టీ మంత్రి పోచారం ఘాటు వ్యాఖ్య


ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు జైలు కూడు తినక తప్పదని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. మెదక్, నిజామాబాదు జిల్లాల పర్యటన సందర్భంగా నిన్న ఓటుకు నోటు కేసును ప్రస్తావించిన పోచారం ఘాటు వ్యాఖ్యలు సంధించారు. చంద్రబాబుతో పాటు రేవంత్ రెడ్డికి చట్టం చుట్టం కాదన్న పోచారం, తప్పు చేసిన ప్రతి ఒక్కరికీ శిక్ష తప్పదని తేల్చిచెప్పారు. హైదరాబాదులో ప్రజలు సుఖశాంతులతో ఉన్నప్పటికీ టీడీపీ నేతలు సెక్షన్ 8ను తెరపైకి తెచ్చి కుట్రలకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. అయినా అద్దెకున్న వారు పెత్తనం చెలాయిస్తామంటే ఎలా ఒప్పుకుంటామని పోచారం ప్రశ్నించారు.

  • Loading...

More Telugu News