: అక్షిత గోల్డ్, ట్రోగోపాన్ సంస్థల ఆస్తుల జప్తు... ఏపీ హోం శాఖ ఉత్తర్వులు జారీ
అధిక వడ్డీ ఆశచూపి అమాయక ప్రజల నెత్తిన శఠగోపం పెట్టిన అక్షిత గోల్డ్, ట్రోగోపాన్ సంస్థలపై ఏపీ హోం మంత్రిత్వ శాఖ కొరడా ఝుళిపించింది. రెండు సంస్థలకు చెందిన ఆస్తులను జప్తు చేస్తూ నిన్న ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం... అక్షిత అగ్రిగోల్డ్ సంస్థకు చెందిన 39 ఎకరాల భూమి, ట్రోగోపాన్ కు చెందిన దాదాపు రూ.3 కోట్ల విలువ చేసే భూములు ప్రభుత్వ స్వాధీనంలోకి వెళ్లాయి. మాయ మాటలు చెప్పి జనం నెత్తిన కుచ్చుటోపి పెట్టే సంస్థలను ఎంతమాత్రం ఉపేక్షించరాదన్న ప్రభుత్వ నిర్ణయం నేపథ్యంలో హోం శాఖ ఈ కఠిన నిర్ణయం తీసుకుంది.