: ఏగాన్ టోర్నీలో సెమీస్ లోకి దూసుకెళ్లిన సానియా జోడీ


సానియా మీర్జా-మార్టినా హింగిస్ జోడీ ఏగాన్ ఇంటర్నేషనల్ టోర్నీలో సెమీస్ లోకి దూసుకెళ్లింది. ఈస్ట్ బర్న్ లో జరుగుతున్న ఈ టోర్నీలో సానియా జోడీ క్వార్టర్ ఫైనల్లో 4-6, 6-3, 10-6 తో చాన్-పెనెట్టా జోడీపై విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో సానియా జోడీ పోరాటపటిమ కనబర్చింది. తొలి సెట్ ను ప్రత్యర్థి జోడీకి కోల్పోయినా, ఆ తర్వాత వరుసగా రెండు సెట్లు నెగ్గి మ్యాచ్ ను కైవసం చేసుకుంది. సానియా-హింగిస్ ద్వయం సెమీస్ లో కరోలిన్ గార్సియా-కేథరీనా స్రెబోత్నిక్ జోడీతో అమీతుమీ తేల్చుకోనుంది.

  • Loading...

More Telugu News