: సల్మాన్ ఖాన్ ను వీడని కష్టాలు...మరో కేసు దాఖలు


బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ను కష్టాలు వీడేలా కనిపించడం లేదు. ఇప్పటికే హైకోర్టులో వున్న 'హిట్ అండ్ రన్' కేసుపై మరో కేసు నమోదైంది. 'హిట్ అండ్ రన్' సమయంలో సల్మాన్ వెంట వున్న బాడీ గార్డు రవీంద్ర పాటిల్ మృతిపై సీబీఐ దర్యాప్తు జరిపించాలని పూనేకు చెందిన ఆర్టీఐ కార్యకర్త హేమంత్ పాటిల్ బాంబే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రవీంద్ర పాటిల్ పై సల్మాన్ ఖాన్ తెచ్చిన ఒత్తిడిపై విచారణ జరగలేదని, దానిపై విచారించి సల్మాన్ పై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. కేసు వాపస్ తీసుకోవాలంటూ రవీంద్ర పాటిల్ ను సల్మాన్ తీవ్రంగా ఒత్తిడి చేశాడని, చివరి క్షణాల్లో ఆ కేసు తన జీవితాన్ని నాశనం చేసిందని పాటిల్ మీడియాతో పేర్కొన్నట్టు వార్తా కథనాలు వెలువడిన సంగతి తెలిసిందే. అలాగే పాటిల్ పై ఒత్తిడి తెచ్చే క్రమంలో అతనికి హెచ్ఐవీ ఎక్కించినట్టు పలు కథనాలు ప్రసారమయ్యాయి.

  • Loading...

More Telugu News