: మహారాష్ట్ర మంత్రికి ఏసీబీ లేఖ
మహారాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి పంకజ్ ముండేకు ఆ రాష్ట్ర అవినీతి నిరోధక శాఖ ఓ లేఖ రాసింది. పల్లి పట్టి స్కాంలో వస్తున్న ఆరోపణలపై వివరణ ఇవ్వాలని లేఖలో కోరింది. టెండర్లు పిలవకుండానే రూ. 206 కోట్లతో పుస్తకాలు, తినుబండారాలు, వాటర్ ఫిల్టర్లు కొనుగోళ్లు జరిపారంటూ పంకజ్ పై కాంగ్రెస్ తో పాటు ఇతర పార్టీలు కూడా ఆరోపణలు సంధిస్తున్నాయి. ఈ నేపథ్యంలో, పంకజ్ ముండే వివరణ కోసం ఏసీబీ లేఖ రాసింది.