: రేప్ కేసులపై పుస్తకం రాసిన హెడ్ కానిస్టేబుల్


ఔరంగాబాద్ క్రైమ్ బ్రాంచ్ విభాగంలో హెడ్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న ద్వారకాదాస్ భంగే రేప్ కేసులపై ఓ పుస్తకం రాశారు. రేప్ కేసుల దర్యాప్తు విషయంలో పోలీసులు ఎలా వ్యవహరించాలి? నేరం నిరూపించడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వంటి అంశాలను ఇందులో పొందుపరిచారు. రేప్ కేసుల్లో సుప్రీంకోర్టు తీర్పులు, పరిశీలనల ఆధారంగా ఈ పుస్తకం రాశారు. ఈ పుస్తకానికి 'సుప్రీంకోర్ట్ ఆన్ రేప్ కేసెస్' అని పేరు పెట్టారు. హెడ్ కానిస్టేబుల్ భంగే సైన్స్, న్యాయశాస్త్రంలో గ్రాడ్యుయేట్. 1991లో పోలీస్ శాఖలో చేరారు. ఈ 121 పేజీల పుస్తకంలో... 1967 నుంచి సుప్రీం కోర్టు విచారించిన రేప్ కేసులు, వాటి తాలూకు తీర్పులు, ఆదేశాలు, పరిశీలనలను పొందుపరిచారు. కాగా, ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న సీనియర్ ఐఏఎస్ అధికారి సంజయ్ కుమార్ హెడ్ కానిస్టేబుల్ భంగేను అభినందించారు. మహారాష్ట్రలో చోటు చేసుకున్న రేప్ ఘటనల్లో నేర నిరూపణ శాతం పెరిగేందుకు ఈ పుస్తకం సహాయకారిగా ఉంటుందని భావిస్తున్నట్టు సంజయ్ కుమార్ తెలిపారు.

  • Loading...

More Telugu News