: సెల్ఫీల వల్లే భారత్ లో షాపింగ్ చేయలేకపోతున్నా: శిల్పా శెట్టి
అలా రోడ్డు మీద నడుచుకుంటూ వెళుతూ, నచ్చిన వస్తువును కొనుక్కుంటూ, ఇష్టమైనవి తింటూ ఉంటే భలే మజాగా ఉంటుందని బాలీవుడ్ నటి శిల్పా శెట్టి పేర్కొంది. అయితే ఆ అద్భుతమైన అనుభూతిని అభిమానులు తనకు దూరం చేసేశారని వాపోయింది. భారత్ లో కొత్తగా మారిన సెల్ఫీ సంప్రదాయం షాపింగ్ కు ఆటంకంగా మారిందని శిల్పా శెట్టి చెప్పింది. ఇంటికి అవసరమైన వస్తువులు షాపింగ్ చేద్దామని వెళ్తే మాల్స్ లో కూడా అభిమానులు వెంటపడుతున్నారని అసహనం వ్యక్తం చేసింది. దీంతో ఆన్ లైన్ కొనుగోళ్లకే పరిమితమైపోతున్నానని శిల్పాశెట్టి ఆవేదన వ్యక్తం చేసింది. ఆదివారం కూడా ఆన్ లైన్ లో కొనుగోళ్లు చేసుకోవచ్చని శిల్పా శెట్టి తెలిపింది. విదేశాలకు వెళ్లినప్పుడు హాయిగా షాపింగ్ చేసుకోవచ్చని శిల్పా శెట్టి చెప్పింది.