: పోలవరం ప్రాజెక్టు పేరు మారింది!
అధికారంలోకి ఎవరు వస్తే వారికి అనుగుణంగా పథకాలు, ప్రాజెక్టులు, కట్టడాల పేర్లు మారిపోతుంటాయని రాజకీయ నాయకులు చెబుతుంటారు. వారి వ్యాఖ్యలకు అనుగుణంగా ప్రతిష్ఠాత్మకమైన పోలవరం ప్రాజెక్టు పేరు కూడా మారింది. గతంలో 'ఇందిరా సాగర్ పోలవరం'గా ఉన్న ప్రాజెక్టు పేరును 'పోలవరం సాగు నీటి ప్రాజెక్టు'గా టీడీపీ ప్రభుత్వం మార్చింది. ప్రాజెక్టు పేరు మార్పుపై టీడీపీ ప్రభుత్వం నేడు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఇకపై పోలవరం ప్రాజెక్టును అధికారిక పత్రాలు, బిల్లులు, చెక్కుల జారీ, పనుల పర్యవేక్షణ, ఇతరత్రాల్లో 'పోలవరం సాగునీటి ప్రాజెక్టు'గా పేర్కోనున్నారు. కాగా, గతంలో పేరు మార్పుపై వచ్చిన పుకార్లను కాంగ్రెస్ నేతలు ఖండించిన సంగతి తెలిసిందే!