: ఉదయ్ కిరణ్ ఆఖరి చిత్రం విడుదలను అడ్డుకున్న కోర్టు


దివంగత హీరో ఉదయ్ కిరణ్ నటించిన చివరి చిత్రం 'చిత్రం చెప్పిన కథ' విడుదలను ఆపాలంటూ హైదరాబాదు సిటీ సివిల్ కోర్టు స్టే ఇచ్చింది. మున్నా నిర్మాతగా, ఎల్.ఆర్.కే. మోహన్ దర్శకత్వం వహించిన చిత్రం టీజర్ ఇటీవలే విడుదలైన సంగతి తెలిసిందే. వాస్తవానికి ఈ చిత్రం గత నెలలోనే విడుదల కావాల్సి వుంది. అయితే, ఫైనాన్షియర్స్ మధ్య నెలకొన్న వివాదం విడుదలను ఆలస్యం చేసింది. ఇప్పుడిక వివాదం కోర్టుకు ఎక్కడంతో విడుదల ఎప్పుడవుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. కాగా, ఉదయ్ కిరణ్ కెరీర్ తొలినాళ్లలో వచ్చిన 'నువ్వు నేను' హీరోయిన్ అనిత ఈ చిత్రంలో ప్రత్యేక పాత్రలో నటించడం విశేషం!

  • Loading...

More Telugu News