: 'ఓటుకు నోటు' కేసులో ముద్దాయిగా ఏ క్షణమైనా చంద్రబాబు పేరు!


ఓటుకు నోటు కేసులో ముద్దాయిగా చంద్రబాబు పేరును చేర్చాలని తెలంగాణ ఏసీబీ నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. అందుబాటులో ఉన్న సాక్ష్యాలు, పరిస్థితులను పరిశీలించిన మీదట ఏసీబీ ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఈ కేసులో ఫోరెన్సిక్ లాబొరేటరీ ఆడియో, వీడియో టేపులు అసలైనవేనని తేల్చి అదే విషయాన్ని సీల్డ్ కవర్లో కోర్టుకు ఇచ్చిన నేపథ్యంలో, వాటిని తదుపరి సాక్ష్యంగా తమకివ్వాలని ఇప్పటికే ఏసీబీ అధికారులు పిటిషన్ దాఖలు చేశారు. ఆ నివేదిక చేతికందిన మరుక్షణం చంద్రబాబును కేసులో చేర్చాలని ఏసీబీ భావిస్తున్నట్టు తెలిసింది. చట్టపరమైన అడ్డంకులు రాకుండా ఉండాలంటే, ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి వచ్చిన నివేదిక వివరాలు తీసుకున్న తరువాతనే ముందడుగు వేయాలని అధికారులు భావిస్తున్నారు. ఏ క్షణమైనా ఆయన పేరును నిందితుడిగా చేర్చవచ్చని తెలుస్తోంది. గత 25 రోజులుగా ఈ కేసును అడ్డుకునేందుకు చంద్రబాబునాయుడు, ఏపీ ప్రభుత్వం శతవిధాలుగా ప్రయత్నాలు జరుపుతూనే వుంది. పలు అంశాలను తెరపైకి తెచ్చిన ఏపీ ప్రభుత్వం, కేసీఆర్ పై నమోదైన కేసుల విచారణకు సిట్ ను కూడా ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News