: 'ఓటుకు నోటు' కేసులో రంగంలోకి దిగన ఎక్సైజ్ శాఖ... కస్టడీలోకి ఏ-3 ఉదయసింహ


'ఓటుకు నోటు' కేసు మరో మలుపు తిరిగింది. ఈ కేసును విచారిస్తున్న ఏసీబీతో పాటు తెలంగాణ ఎక్సైజ్ శాఖ కూడా రంగంలోకి దిగింది. ఈ కేసులో ఎ-3 ముద్దాయిగా ఉన్న ఉదయసింహను ఎక్సైజ్ అధికారులు రెండు రోజుల కస్టడీ నిమిత్తం తీసుకెళ్లారు. ఉదయసింహ అరెస్టయిన తరవాత ఆయన ఇంటిలో సోదాలు నిర్వహించగా, అక్రమంగా నిల్వ ఉంచిన విదేశీ మద్యం బాటిళ్లు లభ్యమైన సంగతి తెలిసిందే. ఆ మద్యం ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరి కోసం తెప్పించారు? ఎవరికైనా ఇచ్చారా? వంటి ప్రశ్నలకు సమాధానాల కోసం ఉదయసింహను ఎక్సైజ్ అధికారులు విచారించనున్నట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News