: కేంద్ర మంత్రులను కలసి గోడు వెళ్లబోసుకున్న ఏపీ విద్యుత్ ఉద్యోగులు


తెలంగాణ ప్రభుత్వం రిలీవ్ చేసిన విద్యుత్ ఉద్యోగులు ఢిల్లీలో ఈరోజు కేంద్రమంత్రులు రాజ్ నాథ్ సింగ్, వెంకయ్యనాయుడు, సుజనాచౌదరిలను కలిశారు. టీ.ట్రాన్స్ కో నుంచి ఏపీ స్థానికత ఆధారంగా 1400 మంది ఉద్యోగులను అన్యాయంగా రిలీవ్ చేశారని చెప్పారు. దానికి సంబంధించిన ఉత్వర్వులపై హైకోర్టు స్టే ఇచ్చినప్పటికీ విధుల్లోకి తీసుకోవడం లేదని తెలిపారు. ఇలా తమను స్థానికత పేరుతో విడదీయడం సరికాదని ఆవేదన వ్యక్తం చేశారు. రెండు ప్రభుత్వాలు ఒక నిర్ణయం తీసుకున్నాకే రిలీవ్ చేసేలా చూడాలని మంత్రులకు విన్నవించారు. విభజన చట్టం ప్రకారమే ఉద్యోగులను విభజించాలని ఉద్యోగులు విజ్ఞప్తి చేశారు.

  • Loading...

More Telugu News