: మదిని వీడని సచిన్... ఈ శతాబ్దపు అత్యుత్తమ టెస్టు ఆటగాడిగా అగ్రస్థానం
భారత క్రికెట్ అభిమానుల హీరోగా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ క్రికెట్ పోటీలకు దూరమై నాలుగేళ్లు గడుస్తున్నా, అతనిపై ఉన్న ఆదరణ వీసమెత్తయినా తగ్గలేదు. 21వ శతాబ్దంలో అత్యుత్తమ టెస్టు ఆటగాడు ఎవరని ప్రశ్నిస్తూ, క్రికెట్ ఆస్ట్రేలియా వెబ్ సైట్ నిర్వహించిన ఆన్ లైన్ పోల్ లో సచిన్ తొలి స్థానాన్ని దక్కించుకున్నాడు. గడచిన 15 సంవత్సరాల్లో టెస్టు క్రికెట్ ఆడిన 100 మంది ఉత్తమ ఆటగాళ్లను పోటీలో నిలిపితే, అందరికన్నా సచిన్ కు ఎక్కువ ఓట్లు వచ్చాయి. సచిన్ తరువాతి స్థానంలో శ్రీలంక బ్యాట్స్ మెన్ కుమార సంగక్కార, ఆపై ఆస్ట్రేలియా ఆటగాడు ఆడమ్ గిల్ క్రిస్ట్ లు నిలిచారు. సుమారు 16 వేల మందికి పైగా పాల్గొని తమ అభిమాన ఆటగాళ్లను ఎన్నుకోగా, సచిన్ కు 23 శాతం ఓట్లు వచ్చాయి.