: మంత్రి కడియంను కలసి సన్మానించిన టీడీపీ ఎమ్మెల్యే కృష్ణయ్య
తెలంగాణ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరిని ఆయన ఛాంబర్ లో టీ.టీడీపీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య కలిశారు. రాష్ట్రంలో ఇంటర్మీడియట్ విద్యను ఉచితంగా అందిస్తున్నట్టు ప్రకటించిందుకుగానూ కడియంకు ఎమ్మెల్యే కృష్ణయ్య అభినందనలు తెలిపారు. అనంతరం కడియంకు శాలువా కప్పి సన్మానించి పుష్పగుచ్చాన్ని అందజేశారు. యూనివర్శిటీ హాస్టల్ మెస్ చార్జీలు పెంచాలని ఇదే సమయంలో కృష్ణయ్య కోరారు. దానిపై మంత్రి సానుకూలంగా స్పందించినట్టు తెలిసింది.