: ఉద్ధవ్ కూడా తండ్రిలాగే ధర్మబుద్ధిగల నియంత!: మనోహర్ జోషి
లోక్ సభ మాజీ స్పీకర్, మహారాష్ట్ర మాజీ సీఎం మనోహర్ జోషి శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ థాకరేను ఆకాశానికెత్తేశారు. ఉద్ధవ్ కూడా తండ్రి బాల్ థాకరేలాగా 'సహృదయుడైన నియంత' అని పేర్కొన్నారు. మంచితనంతో కూడిన నియంతృత్వ పోకడలు కనబర్చడం బాలాసాహెబ్ స్టయిల్ అని కితాబిచ్చారు. ఉద్ధవ్ కూడా అదే శైలిని అందిపుచ్చుకున్నారని అన్నారు. ఉద్ధవ్ నాయకత్వ లక్షణాలపైనా జోషి అభిప్రాయాలు వెల్లడించారు. ఎలాంటి ప్రశ్నకైనా జవాబిచ్చేందుకు సదా సిద్ధంగా ఉంటాడని పేర్కొన్నారు. అతడి మీడియా సమావేశాలు చూశానని, వీఐపీలతో మాట్లాడుతుండగా విన్నానని తెలిపాడు. మొత్తమ్మీద, ఉద్ధవ్ ఏదీ దాచుకోని వ్యక్తి అని అభిప్రాయపడ్డారు.