: లలిత్ మోదీ 8 క్రెడిట్ కార్డులు వినియోగిస్తే... ఒక్కటి కూడా అతడిది కాదట!
ఐపీఎల్ సూత్రధారి, దాని ఆధారంగానే పెద్ద ఎత్తున ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డ లలిత్ మోదీ పేరు మోసిన క్రిమినల్ గానే వ్యవహరిస్తున్నాడని విచారణాధికారులు తేల్చేశారు. ప్రస్తుతం విదేశాల్లో ఉన్న అతడు ఇటీవలి కాలంలో దాదాపు ఎనిమిది క్రెడిట్ కార్డులు వినియోగించాడట. అయితే వాటిలో ఏ ఒక్కటి కూడా అతడి పేరిట జారీ కాలేదట. లలిత్ మోదీ వాడిన క్రెడిట్ కార్డుల్లో ఐదు కార్డులు అతడి బావ సురేశ్ చెల్లారం, ఆయన సతీమణి కవితా చెల్లారం పేరిట జారీ అయినవి కాగా, రెండు కార్డులు అతడి సవతి కూతురు కరీమా పేరిట ఉన్నాయి. మిగిలిన మరో కార్డు విజయ్ ఇస్రానీ అనే వ్యక్తి పేరిట జారీ అయ్యింది. విజయ్ ఇస్రానీ పూర్తి వివరాలు విచారణాధికారులకు అంతుచిక్కడం లేదట. తాను వాడిన కార్డుల్లో ఏ ఒక్కటి తనది కాదని సాక్షాత్తు లలిత్ మోదీనే విచారణాధికారులకు మెయిల్ ద్వారా తెలిపాడట.