: టి.సచివాలయంలో సెటిలర్ల కోసం ఓ ఫిర్యాదు విభాగాన్ని ఏర్పాటు చేయాలి: సెటిలర్స్ ఫోరం కన్వీనర్


విభజన చట్టంలో ఉన్న సెక్షన్-8 అవసరమేనని... అయితే, దాన్ని ఇప్పటికిప్పుడు అమలు చేయాల్సిన అవసరం లేదని సెటిలర్స్ ఫోరం కన్వీనర్, మాజీ ఎమ్మెల్యే కాట్రగడ్డ ప్రసూన అన్నారు. హైదరాబాదులో సీమాంధ్రులకు రక్షణ కొరవడిందంటూ ఏపీ పాలకులు వివాదం చేయడం మంచిది కాదని అభిప్రాయపడ్డారు. అయితే, సెటిలర్స్ కోసం తెలంగాణ సచివాలయంలో ఓ ఫిర్యాదు విభాగాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. మీడియా ప్రతినిధులతో ఆమె మాట్లాడుతూ, తెలంగాణ వచ్చాక హైదరాబాద్ విలువ మరింత పెరిగిందని అన్నారు. హైదరాబాదును కేంద్ర పాలిత ప్రాంతంగా చేయాలంటూ ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు డిమాండ్ చేయడం సరికాదని తెలిపారు.

  • Loading...

More Telugu News