: ఎమ్మెల్యే వంశీకి చేదు అనుభవం!
విజయవాడ విమానాశ్రయంలో స్థానిక శాసన సభ్యుడు వంశీకి చేదు అనుభవం ఎదురైంది. ఈ ఉదయం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విజయవాడ ఎయిర్ పోర్టుకు వస్తున్నారన్న సమాచారంతో ఆయన్ను కలిసేందుకు వంశీ వెళ్లారు. ఈ సమయంలో వంశీ లోపలికి వెళ్లేందుకు కుదరదని సీఎం సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. తాను ఇక్కడి ఎమ్మెల్యేనని చెప్పినా వారు వినలేదని తెలుస్తోంది. దీంతో దాదాపు గంట పాటు అక్కడే వేచి చూసిన ఆయన, చివరికి చంద్రబాబును కలవకుండానే వెనుదిరిగి వెళ్లారు. అంతకుముందు సెక్యూరిటీ సిబ్బంది వ్యవహార శైలిపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.