: నేడు విశాఖకు రానున్న కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి... చంద్రబాబుతో భేటీ


కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ ఈరోజు విశాఖపట్నంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా దేశ వ్యూహాత్మక పెట్రోలియం నిల్వలను ఆయన పరిశీలిస్తారు. అనంతరం మధ్యాహ్నం కేజీ బేసిన్ లో పర్యటిస్తారు. ఆ తర్వాత ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ అవుతారు. పుష్కరాల పనులను పర్యవేక్షించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికే రాజమండ్రి బయల్దేరిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా, ఏపీలోని పరిశ్రమలకు గ్యాస్ సరఫరా గురించి కేంద్ర మంత్రితో చంద్రబాబు చర్చించే అవకాశం ఉంది.

  • Loading...

More Telugu News