: స్టీఫెన్ సన్ ను ఫాంహౌస్ లో పెట్టుకుని కేసీఆర్ గూడుపుఠాణీ చేస్తున్నారు: గాలి ముద్దుకృష్ణమ


ఓటుకు నోటు కేసులో ప్రధాన వ్యక్తి అయిన ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ ను సీఎం కేసీఆర్ తన ఫాంహౌస్ లో పెట్టుకుని గూడుపుఠాణీ చేస్తున్నారని టీడీపీ నేత గాలి ముద్దుకృష్ణమనాయుడు ఆరోపించారు. కేసులో కీలక సాక్షి అయిన వ్యక్తిని కేసీఆర్ తన వద్ద పెట్టుకోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. మే 21న వైసీపీ, టీఆర్ఎస్ నేతలు సితార హోటల్ లో కలుసుకుని కుట్రపన్నారని గాలి ఆరోపించారు. రాయలసీమ బాగుపడటం జగన్ కు ఇష్టం లేదని, బాగుపడితే తన ఫ్యాక్షన్ రాజకీయాలు సాగవని భయపడుతున్నారని విమర్శించారు. హైదరాబాదులోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ముద్దుకృష్ణమనాయుడు మాట్లాడారు. సెక్షన్-8పై ఎప్పటి నుంచో మాట్లాడుతున్నామని ఉద్ఘాటించారు.

  • Loading...

More Telugu News