: ‘భోగాపురం’పై రైతుల దండయాత్ర... తహశీల్దార్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత


విజయనగరం జిల్లా భోగాపురంలో ఏపీ ప్రభుత్వం నిర్మించతలపెట్టిన విమానాశ్రయంపై రైతులు యుద్ధం ప్రకటించారు. విమానాశ్రయ నిర్మాణం కోసం జరుగుతున్న భూసేకరణకు నిరసనగా వెయ్యి మందికి పైగా రైతులు కొద్దిసేపటి క్రితం భోగాపురం తహశీల్దార్ కార్యాలయం ముట్టడికి తరలివచ్చారు. సమాచారం అందుకున్న పోలీసులు కూడా పెద్ద సంఖ్యలో అక్కడకు చేరుకున్నారు. ప్రస్తుతం ఇరువర్గాలు తహశీల్దార్ కార్యాయలం వద్ద ఎదురెదురుగా మోహరించి ఉన్నాయి. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఎయిర్ పోర్టుకు భూములిచ్చేది లేదని ఈ సందర్భంగా రైతులు తేల్చిచెప్పారు.

  • Loading...

More Telugu News