: ఆగమేఘాలపై పట్టిసీమను నిర్మిస్తున్న చంద్రబాబుకు హంద్రీనీవా కనిపించడం లేదా?: వైకాపా ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డి
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తానిచ్చిన హామీలను పూర్తిగా విస్మరించారని వైకాపా ఎమ్మెల్యే కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఆరోపించారు. ఆగమేఘాలపై పట్టిసీమ ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టిన చంద్రబాబుకు... రాయలసీమకు అత్యంత కీలకమైన హంద్రీనీవా ప్రాజెక్టు కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. రైతుల సమస్యలను పరిష్కరించాలంటూ వైకాపా ఆధ్వర్యంలో అనంతపురం ఆర్డీవో కార్యాలయం ఎదుట ఈరోజు మహాధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, టీడీపీ పాలనపై నిప్పులు చెరిగారు. ఓటుకు నోటు కేసులో బీజీగా ఉన్న చంద్రబాబు రైతుల సమస్యలను గాలికొదిలేశారని మండిపడ్డారు.