: ఫలించిన చర్చలు... సమ్మెను విరమించిన లారీ ఓనర్లు
సమ్మెకు దిగిన లారీ ఓనర్లతో తెలంగాణ ప్రభుత్వం కొద్దిసేపటి క్రితం జరిపిన చర్చలు ఫలప్రదమయ్యాయి. దీంతో సమ్మెను విరమిస్తున్నట్లు లారీ ఓనర్లు ప్రకటించారు. తాము లేవనెత్తిన సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం హామీ ఇచ్చిందన్న లారీ ఓనర్లు సమ్మెను ముగిస్తున్నట్లు వెల్లడించారు. లారీ ఓనర్ల డిమాండ్లపై చర్చించి, పరిష్కారం చూపేందుకు కేబినెట్ సబ్ కమిటీని నియమిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. దీంతో నిన్నటి నుంచి ఎక్కడికక్కడ నిలిచిన లారీలు మరికాసేపట్లో కదలనున్నాయి.