: ఏపీ విద్యార్థుల బస్ పాస్ చెల్లదంటూ టీ.ఆర్టీసీ బస్ కండక్టర్ తిరస్కరణ


ఏపీ, తెలంగాణ రాష్ట్రాల సరిహద్దులో చిన్నపాటి వివాదం చెలరేగింది. తెలంగాణ ఆర్టీసీ బస్సులో ఏపీ విద్యార్థులను ఎక్కించుకునేందుకు కండక్టర్ తిరస్కరించాడని, దాంతో విద్యార్థులకు, ఆర్టీసీ సిబ్బందికి ఘర్షణ జరిగిందని తెలిసింది. ఖమ్మం జిల్లా మధిరకు కృష్ణా జిల్లా సరిహద్దు. నందిగామ నుంచి మధిర వెళుతున్న ఖమ్మం జిల్లా బస్సులో కృష్ణా జిల్లాలోని రామిరెడ్డిపల్లి, జొన్నలగడ్డలో కొంతమంది ఇంజనీరింగ్ విద్యార్థులు బస్ ఎక్కారు. కానీ ఏపీ విద్యార్థుల బస్ పాస్ చెల్లదంటూ కండక్టర్ నిరాకరించాడు. దాంతో బస్సులను వెళ్లనివ్వకుండా విద్యార్థులు ఆందోళన చేపట్టారు. ఖమ్మం జిల్లా మధిర నుంచి కృష్ణా జిల్లా నందిగామ, జగ్గయ్యపేటలకు... ఇటు మధిర, వైరాలకు బస్సు సర్వీసులు నడుస్తుంటాయి. మధిర, నందిగామ మధ్యలో ఉన్న ఊళ్లలోని ఎంతోమంది విద్యార్థులు అటు, ఇటూ కళాశాలల్లో చదువుతుంటారు. వారిలో కొంతమందికి నందిగామ నుంచి తీసుకున్న బస్ పాస్ లు ఉంటాయి. దాంతో తెలంగాణ ఆర్టీసీ బస్సులో ఏపీ బస్ పాస్ చెల్లదనడంతో వివాదానికి దారి తీసింది. అయితే రాష్ట్ర విభజన జరిగిందని ఆర్టీసీ బస్సుల్లో విద్యార్థులను ఎక్కించుకోమనడం ఎంతవరకు సబబని సామాన్య ప్రజానీకం ప్రశ్నిస్తున్నారు.

  • Loading...

More Telugu News