: మరణమృదంగం... బోనుల్లో యువకుల మధ్య పోటీలు, ఓడినవారిని కాల్చి చంపేయిస్తున్న ఐఎస్ఐఎస్
చుట్టూ ఇనుప బోన్... ఎటూ వెళ్లేందుకు దారి ఉండదు. ప్రాణం దక్కాలంటే పోరాడాలి. ఓడితే మరణమే... ఈ తరహా సీన్లు చాలా సినిమాల్లో చూశాం. కానీ ఇది నిజంగా జరుగుతోంది. యువకుల మధ్య 'మృత్యుపోరు' పెట్టి ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు వేడుక చేసుకుంటున్నారు. ఓడిన వారిని గెలిచిన వారితో కాల్చిపారేయిస్తున్నారు. ఈ దృశ్యాలు వీడియోల రూపంలో తీసి విడుదల చేయగా, ప్రపంచమే 'షాక్'తింది. దాదాపు ఏడు నిమిషాలున్న ఈ వీడియోలో నైపుణ్యవంతులైన ఫైటర్లను ఎంపిక చేస్తున్నామంటూ, ఐఎస్ఐఎస్ పై ఆసక్తితో, ఫైటర్లుగా చేరేందుకు వెళ్లిన వారి ప్రాణాలను బలిగొంటున్న దృశ్యాలున్నాయి. తలలతో కాంక్రీట్ దిమ్మెలను పగుల గొట్టించడం, కర్రలతో కొట్టడం, వారిని వరుసగా పడుకోబెట్టి వారిపై నుంచి నడవడం వంటి దృశ్యాలు ఈ వీడియోలో ఉన్నాయి. ఈ వీడియోను ఇరాక్ లో తీసి వుంటారని భావిస్తున్న అధికారులు, దీని వెనుక నిజానిజాలు విచారించాల్సి వుందని అంటున్నారు.