: ఆ టేపులన్నీ ఒరిజినలే...అతుకుల మాటే లేదట!: ఏసీబీ కోర్టుకు ఎఫ్ఎస్ఎల్ నివేదిక


ఓటుకు నోటు కేసులో తెలంగాణ ఏసీబీ సేకరించిన ఆడియో, వీడియో టేపులు ఒరిజినలేనని, వాటిలో ఎలాంటి అతుకులు లేవని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబోరేటరీ (ఎఫ్ఎస్ఎల్) తేల్చేసిందన్న వార్తలు జోరందుకున్నాయి. కేసులో కీలక సాక్ష్యాలుగా మారిన ఆడియో, వీడియో టేపుల వాస్తవికతను నిర్ధారించుకునేందుకు ఏసీబీ అధికారులు వాటిని ఎఫ్ఎస్ఎల్ కు పంపిన సంగతి తెలిసిందే. ఈ టేపులను క్షుణ్ణంగా పరిశీలించిన ఎఫ్ఎస్ఎల్ నిన్న తన ప్రాథమిక నివేదికను సీల్డ్ కవర్ లో ఏసీబీ కోర్టుకు అందజేసింది. కేసులోని ఆడియో, వీడియో టేపులన్నీ ఒరిజినలేనని, అందులో ఎలాంటి అతుకులు లేవని తన నివేదికలో ఎఫ్ఎస్ఎల్ పేర్కొన్నట్లు విశ్వసనీయ సమాచారం.

  • Loading...

More Telugu News