: 'కడలి' కష్టాలలో మణిరత్నం
గతంలో అద్భుతమైన సినిమాలను రూపొందించిన ప్రముఖ తమిళ దర్శకుడు మణిరత్నంకు ఇబ్బందులు ఎదురయ్యాయి. ఇటీవల ఆయన తీసిన 'కడల్' (తెలుగులో కడలి) చిత్రం బాక్సాఫీసు వద్ద దారుణంగా అపజయం పాలైంది. దాంతో, తమిళంలో ఈ చిత్రాన్ని కొనుగోలు చేసిన పంపిణీదారులు ఆందోళన చేబట్టారు. ఈ క్రమంలో శనివారం నాడు చెన్నయ్ లోని మణిరత్నం ఆఫీసును వారు ముట్టడించారు.
తమ నష్టాలను మణిరత్నం భరించాలంటూ పంపిణీ దారులు డిమాండు చేశారు. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొనడంతో, పోలీసులు రంగ ప్రవేశం చేసి, మణిరత్నం ఆఫీసు, ఇంటి వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. మణిరత్నం మాత్రం ఈ సంఘటనపై ఇంతవరకు స్పందించలేదు.