: ప్రముఖ రచయిత పుల్లెల శ్రీరామచంద్రుడు కన్నుమూత... సీఎం చంద్రబాబు సంతాపం


ప్రముఖ రచయిత పుల్లెల శ్రీరామచంద్రుడు (88) కన్నుమూశారు. హైదరాబాదు బంజారాహిల్స్ లోని తన నివాసంలో ఆయన బుధవారం తుదిశ్వాస విడిచారు. శ్రీరామచంద్రుడు మృతికి ఏపీ సీఎం చంద్రబాబునాయుడు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మృతి సాహితీ లోకానికి తీరని లోటు అని పేర్కొన్నారు. కాగా, శ్రీరామచంద్రుడు తెలుగు, సంస్కృత భాషల్లో 200కి పైగా రచనలు చేశారు. వాల్మీకి రామాయణాన్ని తెలుగులోకి అనువదించారు. ఇక, సాహిత్యరంగంలో ఆయన కృషికి గుర్తింపుగా 2011లో కేంద్రం 'పద్మశ్రీ'తో గౌరవించింది.

  • Loading...

More Telugu News