: బీజేపీ ఎమ్మెల్యేలను మార్షల్స్ మోసుకెళ్లిపోయారు


ఢిల్లీ అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యేలను మార్షల్స్ మోసుకుపోయిన ఘటన రెండో రోజు కూడా రిపీట్ అయింది. శాసనసభా కార్యక్రమాలు అడ్డుకుంటున్నారన్న ఆరోపణలతో బీజేపీ ఎమ్మెల్యేలను స్పీకర్ సభ బయటకు పంపారు. నాలుగవ ఢిల్లీ ఫైనాన్స్ కమిషన్ సిఫారసులను అమలు చేయాలంటూ వెల్ లోకి దూసుకెళ్లిన ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేలను స్పీకర్ రామ్ నివాస్ గోయల్ బయటికి పంపారు. బడ్జెట్ పై చర్చ సమయంలో పదేపదే అడ్డుతగులుతుండడంతో వారిని బయటకు పంపినట్టు స్పీకర్ వెల్లడించారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రకటన చేస్తున్న సందర్భంగా బీజేపీ ఎమ్మెల్యే ఓపీ శర్మ ఆయనను అడ్డుకునేందుకు వెల్ లోకి దూసుకొచ్చారు. అనంతరం మిగిలిన ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేలు కూడా వెల్ లోకి వెళ్లి నినాదాలు చేశారు. దీంతో స్పీకర్ ఆదేశాల మేరకు మార్షల్స్ రంగప్రవేశం చేసి వారిని బయటకు మోసుకెళ్లిపోయారు.

  • Loading...

More Telugu News