: ఏసీబీ కోర్టుకు ఎఫ్ఎస్ఎల్ ప్రాథమిక నివేదిక


ఓటుకు నోటు కేసులో ఆడియో, వీడియో టేపులను పరిశీలించిన ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ తన ప్రాథమిక నివేదికను ఏసీబీ కోర్టుకు సమర్పించింది. మొత్తం 14 ఆడియో, వీడియో టేపులను ల్యాబ్ లో పరిశీలించి ఎఫ్ఎస్ఎల్ ఆ నివేదిక రూపొందించింది. టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి, సెబాస్టియన్, ఉదయసింహ, మత్తయ్య తదితరులు మాట్లాడినట్టు ఉన్న టేపులను ఎఫ్ఎస్ఎల్ పరీక్షించిన సంగతి తెలిసిందే. ఈ నివేదికకు సంబంధించిన ఒక కాపీని తమకు కూడా ఇవ్వాలని ఏసీబీ అధికారులు కోర్టులో మెమో దాఖలు చేశారు. కాపీ అందాక ఈ కేసులో నిందితులపై ఏసీబీ తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉంది.

  • Loading...

More Telugu News