: మత్తయ్య క్వాష్ పిటిషన్ పై విచారణ రేపటికి వాయిదా
ఓటుకు నోటు కేసులో ఏ-4 నిందితుడిగా ఉన్న జెరూసలేం మత్తయ్య క్వాష్ పిటిషన్ పై హైకోర్టులో వాదనలు ముగిశాయి. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ తరపు న్యాయవాది, మత్తయ్య తరపు న్యాయవాది కోర్టులో వాదనలు వినిపించారు. తదుపరి ఉత్తర్వులు వెల్లడించేవరకూ మత్తయ్య అరెస్టుపై స్టే అమల్లో ఉంటుందని హైకోర్టు ఆదేశించింది. అనంతర విచారణను రేపటికి వాయిదా వేసింది.