: గ్రీస్ డ్రామా... వణికిన దలాల్ స్ట్రీట్!


దాదాపు పది రోజుల పాటు భారత స్టాక్ మార్కెట్లు కొత్త ఉత్సాహంతో దూసుకుపోయాయి. సెన్సెక్స్ 1000 పాయింట్లకు పైగా లాభపడింది. లిస్టెడ్ కంపెనీల సంయుక్త మార్కెట్ క్యాప్ కోటి కోట్ల రూపాయలను దాటింది. అదే ఊపులో మరికొంత కాలం మార్కెట్ బుల్ దూసుకెళ్తుందని నిపుణులు భావించారు. అంతలోనే గ్రీస్ ఉద్దీపన రూపంలో ముప్పు ముంచుకొచ్చింది. మంచి లాభాల్లో ఉన్న సూచీలను నష్టాల్లోకి నెట్టింది. తామిచ్చిన ప్రణాళికను రుణ దాతలు అంగీకరించలేదని గ్రీస్ ప్రధాని అలెక్స్ సిప్రాస్ చేసిన ప్రకటన యూరప్ మార్కెట్లను నష్టాల్లోకి నెట్టింది. ఆ సమయానికి 28 వేల పాయింట్లకు దగ్గరైన సెన్సెక్స్ గంట వ్యవధిలో 150 పాయింట్లు దిగజారింది. బుధవారం నాటి సెషన్ ముగిసేసరికి బీఎస్ఈ సెన్సెక్స్ 74.70 పాయింట్లు పడిపోయి 0.27 శాతం పతనంతో 27,729.67 పాయింట్ల వద్దకు, ఎన్ఎస్ఈ నిఫ్టీ 20.70 పాయింట్లు పడిపోయి 0.25 శాతం పతనంతో 8,360.85 పాయింట్ల వద్దకు చేరాయి. బీహచ్ఈఎల్, జడ్ఈఈఎల్, లుపిన్, హిందుస్థాన్ యూనీలీవర్, సన్ ఫార్మా తదితర కంపెనీలు లాభపడగా, హిందాల్కో, పీఎన్ బీ, బ్యాంక్ ఆఫ్ బరోడా, టాటా స్టీల్, ఎంఅండ్ఎం తదితర కంపెనీలు నష్టపోయాయి. సాయంత్రం 4:30 గంటల సమయంలో యూరప్ మార్కెట్లలో డీఏఎక్స్ 0.88 శాతం, సీఏసీ 0.28 శాతం నష్టంలో ఉన్నాయి.

  • Loading...

More Telugu News