: విశాఖలో ఐఐఎం ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదం


ఏపీలోని విశాఖపట్నంలో ఐఐఎం ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దాంతో పాటు గయ, నాగపూర్, మరో మూడు నగరాల్లో ఐఐఎంల ఏర్పాటుకు ఈరోజు జరిగిన మంత్రిమండలి సమావేశంలో ఆమోదించారు. కేంద్ర కేబినెట్ తీసుకున్న ఈ నిర్ణయం నేటి నుంచే అమల్లోకి రానుంది. అంతేగాక భారత్ నుంచి జపాన్, దక్షిణ కొరియాకు ఇనుప ఖనిజం సరఫరాకు కూడా ఆమోదం తెలిపింది. మూడేళ్ల పాటు నాణ్యమైన ఇనుప ఖనిజం సరఫరా చేసేందుకు అంగీకరించింది. తూర్పు- పశ్చిమ రవాణా కారిడార్ కోసం సవరించిన అంచనా వ్యయం రూ.81,459 కోట్లకు కూడా ఆమోదం తెలిపారు.

  • Loading...

More Telugu News