: కేసీఆర్!...చంద్రబాబును చూసి నేర్చుకో: గంటా


తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును చూసి ముఖ్యమంత్రి అంటే ఎలా ఉండాలో తెలుసుకోవాలని మంత్రి గంటా శ్రీనివాసరావు సలహా ఇచ్చారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం అన్నీ అమలు చేస్తున్నప్పుడు సెక్షన్ 8 మాత్రం ఎందుకు అమలు కాదని అడిగారు. గవర్నర్ సెక్షన్ 8 అమలు చేస్తారని తాము ఆశిస్తున్నట్టు ఆయన చెప్పారు. సెక్షన్ 8పై కేసీఆర్ ది వితండ వాదమని ఆయన తెలిపారు. కేసీర్ కొత్త వివాదం రేపుతున్నారని ఆయన మండిపడ్డారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీల అమలు నుంచి ప్రజల దృష్టి మరల్చడానికే కేసీఆర్ ఇలాంటి వివాదం రేపుతున్నారని ఆయన విమర్శించారు.

  • Loading...

More Telugu News