: ఒళ్లు గగుర్పొడిచేలా ఐఎస్ఐఎస్ కొత్త తరహా పైశాచికత్వం!


ఇస్లాం రాజ్యం పేరిట మారణహోమం సృష్టిస్తున్న ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు అమాయకులను బందీలు చేసి అత్యంత క్రూరమైన పద్ధతుల్లో హత్య చేసేందుకు ఎంచుకుంటున్న మార్గాలు ఒళ్లు గగుర్పొడిచేలా ఉన్నాయి. తాజాగా ఐఎస్ఐఎస్ విడుదల చేసిన వీడియోనే ఇందుకు ఉదాహరణ. తమ పైశాచికత్వాన్ని మరింత చాటుతూ, ఏడు నిమిషాల నిడివిగల వీడియోను ఉగ్రవాదులు విడుదల చేశారు. ఇందులో బందీలను చంపుతున్న మూడు ఘటనలు ఉన్నాయి. తొలుత ఐదుగురు బందీలను ఇనుప బోనులో ఉంచి, దాన్ని పెద్ద స్విమ్మింగ్ పూల్ లో నెమ్మదిగా ముంచుతూ, వారు ఉక్కిరిబిక్కిరి అవుతున్న దృశ్యాలను అండర్ వాటర్ కెమెరాలతో చిత్రీకరించారు. వారు చనిపోయిన తరువాత బోనును నీటి నుంచి వెలికితీసి చూపించారు. మరో ఘటనలో కొందరిని కారులో ఉంచి దాన్ని గ్రనేడ్ మిసైల్ లాంచర్ ద్వారా పేల్చుతూ వీడియో తీశారు. మరో ప్రాంతంలో బందీల మెడకు పేలుడు పదార్థాలు అమర్చిన తాడును చుట్టి దాన్ని కాల్చడం ద్వారా వారి మెడలు తెగి పడిపోవడాన్ని చిత్రించి విడుదల చేశారు. వీరంతా తమపై గూఢచర్యం జరిపేందుకు వచ్చి పట్టుబడ్డారన్నది ఐఎస్ఐఎస్ మోపిన అభియోగం.

  • Loading...

More Telugu News