: 'కేరళ ఆయుర్వేద బ్రాండ్' అంబాసిండర్ గా స్టెఫీ గ్రాఫ్
జర్మనీ టెన్నిస్ దిగ్గజం స్టెఫీ గ్రాఫ్ కేరళ రాష్ట్ర ఆయుర్వేద బ్రాండ్ అంబాసిండర్ గా నియమితులయ్యారు. ఈరోజు నిర్వహించిన ఆ రాష్ట్ర కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ముఖ్యమంత్రి ఉమెన్ చాందీ తెలిపారు. 'విజిట్ కేరళ పథకం'లో భాగంగా గ్రాఫ్ ను ఆయుర్వేద బ్రాండ్ అంబాసిండర్ గా నియమించుకోవడానికి కేరళ టూరిజం విభాగానికి అనుమతి మంజూరు చేసినట్టు చాందీ చెప్పారు. ఇప్పటికే టూరిజం విభాగం ఆమెతో సంప్రదింపులు జరిపిందని, అగ్రిమెంట్ కూడా అందించారని వివరించారు. తన కెరీర్ లో 22 గ్రాండ్ స్లామ్ టైటిళ్లు గెలుచుకున్న 46 ఏళ్ల స్టెఫీ, 1999లో టెన్నిస్ నుంచి రిటైర్ అయింది.