: సైనాకు కేంద్ర ప్రభుత్వ నగదు సాయం
బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ కు కేంద్ర ప్రభుత్వం రూ.9 లక్షల నగదు సాయం అందించింది. 2016 రియో ఒలింపిక్స్ సన్నాహకాల్లో భాగంగా సైనా పూర్తి స్థాయి ఫిజియోథెరపిస్ట్ ను నియమించుకోవాలనుకుంది. ఈ నేపథ్యంలో కేంద్ర క్రీడల మంత్రిత్వ శాఖ ఆమెకు ఈ మొత్తాన్ని మంజూరు చేసింది. ఫిజియోథెరపిస్ట్ కు నెలకు రూ.60 వేల చొప్పున ఈ నెల నుంచి 15 నెలల కాలానికి సరిపడే విధంగా ఈ నగదు మొత్తాన్ని కేటాయించారు. అయితే ఫిజియోథెరపిస్ట్ గా ఎవరిని నియమించుకోవాలన్నది సైనా నిర్ణయానికే వదిలిపెట్టినట్టు క్రీడల శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. ప్రస్తుతం సైనా బెంగళూరులోని ప్రకాశ్ పదుకొన్ బ్యాడ్మింటన్ అకాడమీలో శిక్షణ పొందుతోంది.