: సెక్షన్ 8పై కేసీఆర్ ది అనవసర రాద్ధాంతం...టీ టీడీపీ నేత మోత్కుపల్లి ఫైర్!
ఉమ్మడి రాష్ట్రాల రాజధాని హైదరాబాదులో సెక్షన్ 8 అమలుపై తెలంగాణ సీఎం కేసీఆర్ అనుసరిస్తున్న వైఖరిపై టీ టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సెక్షన్ 8పై కేసీఆర్ వైఖరే సరైనది కాదంటూ కొద్దిసేపటి క్రితం మోత్కుపల్లి వ్యాఖ్యానించారు. సెక్షన్ 8పై కేసీఆర్ చేస్తున్నదంతా అనవసర రాద్ధాంతమేనని ఆయన ఆరోపించారు. ఆంధ్రావాళ్లను తిట్టడం కేసీఆర్ అసమర్థతకు నిదర్శనమన్నారు. తెలంగాణ సెంటిమెంట్ ను కేసీఆర్ ఇంకా వినియోగించుకోవాలని చూస్తున్నారని మోత్కుపల్లి ఆరోపించారు.