: హెలికాప్టర్ బ్లేడ్లను చుట్టేసిన రెడ్ కార్పెట్... కేంద్ర మంత్రి గడ్కరీకి త్రుటిలో తప్పిన ప్రమాదం


కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీని హెలికాప్టర్ ప్రమాదాలు వెంటాడుతున్నాయి. పశ్చిమబెంగాల్ లోని హాల్దియా పర్యటనకు వచ్చిన గడ్కరీ కొద్దిసేపటి క్రితం పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. బలమైన గాలుల నేపథ్యంలో గడ్కరీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ రోటార్ బ్లేడ్లను టార్పాలిన్లు, రెడ్ కార్పెట్ చుట్టేశాయి. అయితే చాకచక్యంగా వ్యవహరించిన పైలట్ హెలికాప్టర్ ను సురక్షితంగా ల్యాండ్ చేశారు. ఈ ప్రమాదంలో గడ్కరీకి ఎలాంటి గాయాలు కాలేదు. హెలికాప్టర్ బ్లేడ్లను చుట్టేసిన రెడ్ కార్పెట్ గడ్కరీకి స్వాగతం పలికేందుకు ఏర్పాటు చేసినది కావడం గమనార్హం. ఇదిలా ఉంటే, నాలుగు రోజుల క్రితం డెహ్రాడూన్ పర్యటనకు వెళ్లిన సందర్భంగానూ గడ్కరీ ప్రయాణించిన హెలికాప్టర్ ఆయనను దించేసి తిరిగివెళుతున్న క్రమంలో ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News