: భారత్ లో మళ్లీ ఎమర్జెన్సీ వచ్చే అవకాశం లేదు: అరుణ్ జైట్లీ


దేశంలో అత్యయిక పరిస్థితి తిరిగి వచ్చే అవకాశం లేదని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ స్పష్టం చేశారు. స్వాతంత్ర్య భారతదేశంలో ఎమర్జెన్సీ (1975-77) చీకటి దశ అని ఆయన పేర్కొన్నారు. "ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం నియంతృత్వ దేశంగా మారడం అన్నది ఈవేళ సాధ్యం కాదు" అంటూ ఎమర్జన్సీ వచ్చే అవకాశాలను జైట్లీ కొట్టిపారేశారు. భవిష్యత్తులో దేశంలో అత్యయిక పరిస్థితి రావొచ్చంటూ కొన్ని రోజుల కిందట ఓ ఆంగ్ల పత్రిక ఇంటర్వ్యూలో బీజేపీ అగ్రనేత ఎల్.కే. అద్వానీ ఆందోళన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అందుకు భిన్నంగా జైట్లీ పైవిధంగా అభిప్రాయపడటం గమనార్హం.

  • Loading...

More Telugu News