: ఆసుపత్రి లోపలికి అనుమతించకపోవడంతో... 108 వాహనంలోనే మహిళ ప్రసవం
కృష్ణా జిల్లా నందిగామ ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యంతో ఓ గర్భిణి 108 వాహనంలోనే ప్రసవించాల్సి వచ్చింది. అంతకుముందు వాహనంలో మహిళను ఆసుపత్రికి తీసుకురాగా వైద్యులు లేరని చెప్పి సిబ్బంది లోపలికి అనుమతించలేదు. దాంతో ఆసుపత్రి బయటే వాహనంలో ఉన్న గర్భిణి వైద్య సహాయం అందక అరగంట పాటు ప్రసవ వేదనకు గురైంది. చివరికి 108 వాహనంలోనే ఆ మహిళ ప్రసవించింది. పుట్టిన బిడ్డ, తల్లి క్షేమంగా ఉన్నారని అక్కడి వారు తెలిపారు. కాగా వైద్యుల నిర్లక్ష్యంపై నందిగామ ప్రభుత్వాసుపత్రి ఎదుట స్థానికులు ఆందోళన చేపట్టారు.