: పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్ష పదవికి నేనింకా రాజీనామా చేయలేదు: నల్లపురెడ్డి
నెల్లూరు జిల్లా వైసీపీ అధ్యక్ష పదవికి తాను రాజీనామా చేశానంటూ వచ్చిన వార్తలు నిజం కాదని వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి తెలిపారు. తానింకా రాజీనామా చేయలేదని, కేవలం ఆలోచన మాత్రమే చేస్తున్నానని చెప్పారు. తన సొంత నియోజకవర్గం బాధ్యతలు చూసుకోవాల్సి ఉన్నందువల్లే అధ్యక్ష పదవిని వదిలిపెట్టాలని ఆలోచన చేస్తున్నానని ఓ తెలుగు చానల్ ఫోన్ లైవ్ లో ఆయన తెలిపారు. అయితే పార్టీని వదిలే ప్రసక్తేలేదని, జగన్ గారిని విడిచివెళ్లనని నల్లపురెడ్డి స్పష్టం చేశారు.