: పదేళ్లే కాదు...రాజధాని నిర్మాణం పూర్తయ్యేదాకా హైదరాబాదులోనే ఉంటాం: ఏపీ మంత్రి అయ్యన్న


ఉమ్మడి రాజధాని హైదరాబాదులో సెక్షన్ 8 అమలుపై ఇరు రాష్ట్రాల మధ్య వాడీవేడీ చర్చ సాగుతోంది. ఈ విషయంపై ఏపీ పంచాయతీరాజ్ శాఖ మంత్రి, టీడీపీ సీనియర్ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడు కొద్దిసేపటి క్రితం ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఉమ్మడి రాజధానిగా పదేళ్ల పాటు హైదరాబాదు ఉంటుందని విభజన చట్టంలో పేర్కొన్న అంశాన్ని ప్రస్తావించిన అయ్యన్న, పదేళ్లే కాదు... నవ్యాంధ్ర రాజధాని నిర్మాణం పూర్తయ్యేదాకా హైదరాబాదును విడిచివెళ్లబోమని తేల్చిచెప్పారు. అప్పటిదాకా హైదరాబాదు నుంచే ఏపీ పాలన సాగుతుందని ఆయన చెప్పారు. ఉమ్మడి రాజధానిలో ఎవరి పోలీసులు వారికి ఉంటారని కూడా పేర్కొన్నారు. విభజన చట్టాన్ని తానే రాశానని చెప్పుకుంటున్న కేసీఆర్, సెక్షన్ 8 చెల్లదని చెప్పడం సరికాదని అయ్యన్నపాత్రుడు వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News