: డ్రంకెన్ డ్రైవ్ లో పట్టుబడితే ఇకపై భారీ జరిమానా!
మద్యం సేవించి వాహనం నడిపే వారిని నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రోడ్డు భద్రతా చట్టంలో మార్పులు తీసుకురాబోతోంది. ఇంతవరకు తాగి వాహనం నడిపితే రూ.2వేల జరిమానా, ఆరు నెలల జైలు శిక్ష విధిస్తున్నారు. ఇకపై ఈ జరిమానా ఐదు రెట్లు పెరిగి రూ.10వేలు కానుంది. సంవత్సరం పాటు జైలు శిక్ష కూడా విధించే విధంగా రోడ్డు భద్రతా బిల్లులో సవరణలు చేస్తూ కేంద్ర రవాణా శాఖ బిల్లును రూపొందించింది. కేంద్ర ప్రతిపాదిత బిల్లును న్యాయ మంత్రిత్వ శాఖ ద్వారా అన్ని రాష్ట్రాల పరిశీలనకు ఇప్పటికే పంపించారు. ఈ బిల్లు చట్ట రూపం దాల్చిన వెంటనే అమల్లోకి రానుంది.