: షాపింగ్ మాల్స్ లో మద్యం విక్రయాలా?..చంద్రబాబు సర్కారు నిర్ణయంపై మహిళల ఆగ్రహం


ఏపీ సర్కారు కొత్త మద్యం పాలసీపై మహిళలు కన్నెర్రజేశారు. మొన్న ఖరారైన మద్యం పాలసీ ప్రకారం ఇకపై షాపింగ్ మాల్స్, సూపర్ మార్కెట్లలోనూ మద్యం విక్రయాలు జరుగుతాయి. టెట్రా ప్యాకెట్లలో మద్యాన్ని విక్రయించేందుకు కొత్త పాలసీ అవకాశం కల్పిస్తోంది. దీనిపై ఏపీీలోని పలు ప్రాంతాల మహిళలు భగ్గుమన్నారు. విజయవాడలో కొద్దిసేపటి క్రితం ఆందోళనకు దిగిన మహిళలు సర్కారు దిష్టిబొమ్మను దహనం చేశారు. మద్యం విక్రయాలను నియంత్రిస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు, ఇచ్చిన మాటను మరిచి మద్యం యథేచ్ఛ విక్రయాలకు తలుపులు బార్లా తెరిచేందుకు యత్నిస్తున్నారని మహిళలు విరుచుకుపడ్డారు. తక్షణమే షాపింగ్ మాల్స్ లో మద్యం విక్రయాలపై నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News