: 'ఓటుకు నోటు'లో కీలక సమాచారం ఉంది... కోర్టుకు తెలిపిన అడ్వొకేట్ జనరల్


ఓటుకు నోటు కేసులో తెలంగాణ సర్కారు చేతికి కీలక సమాచారం చిక్కిందట. ఈ విషయాన్ని కోర్టుకు తెలిపేందుకు అనుబంధ కౌంటర్ దాఖలు చేయనున్నట్లు ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ రామకృష్ణారెడ్డి కొద్దిసేపటి క్రితం హైకోర్టుకు తెలిపారు. బెయిల్ మంజూరు చేయాలన్న రేవంత్ పిటీషన్ దాఖలు చేసిన నేపథ్యంలో హైకోర్టు ఆదేశాల మేరకు తెలంగాణ ఏసీబీ కూడా తన కౌంటర్ ను నిన్ననే దాఖలు చేసింది. ఈ నేపథ్యంలో నేటి విచారణలో రేవంత్ రెడ్డికి బెయిల్ ఇవ్వడమో, పిటీషన్ ను కొట్టివేయడమో జరుగుతుందని అందరూ భావించారు. అయితే తెలంగాణ సర్కారు కొత్త విషయాన్ని తెరపైకి తేవడంతో బెయిల్ పిటీషన్ విచారణ వాయిదా పడక తప్పలేదు. మరి తెలంగాణ ప్రభుత్వం చేతికి చిక్కిన ఆ కీలక సమాచారం ఏమిటనేదానిపై ప్రస్తుతం ఆసక్తికర చర్చకు తెరలేచింది.

  • Loading...

More Telugu News