: అత్యయిక పరిస్థితి చరిత్రలో చీకటిదినం: వెంకయ్యనాయుడు


దేశంలో అత్యయిక పరిస్థితి (ఎమర్జెన్సీ) పెట్టడం చరిత్రలో ఓ చీకటిదినమని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. 40 ఏళ్ల క్రితం ఎమర్జెన్సీ తన జీవిత గమనాన్ని మార్చివేసిందని ఆయన చెప్పారు. ఆనాటి అరాచకాలను యువతకు గుర్తు చేయాల్సిన ఉందని అన్నారు. జూన్ 26, 1975లో దేశంలో ఎమర్జెన్సీ పెట్టి నలభై ఏళ్లు పూర్తికావొస్తోంది. ఈ మేరకు ఢిల్లీలో మీడియాతో వెంకయ్య మాట్లాడారు. మళ్లీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే అవకాశం లేదని ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు. ఆకర్షణీయ నగరాలు, అమృత్ విధివిధానాలను రేపు ప్రధాని నరేంద్రమోదీ ప్రకటిస్తారని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక సంస్థలతో చర్చించాకే పథకాలను రూపొందించారని, కేంద్రం, రాష్ట్రం, స్థానిక సంస్థలు దానికింద రూ.3 లక్షల కోట్లు ఖర్చు చేయనున్నాయని వెంకయ్య తెలిపారు. ఆర్థిక పరిపుష్టి లేకుండా పట్టణాలు అభివృద్ధి చెందవన్న మంత్రి, 3 పథకాల ఆవిష్కరణతో పట్టణ పరిపాలనలో నూతన అధ్యాయం రాబోతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో ఈ ఆకర్షణీయ నగరాల నిర్మాణం జరుగుతుందన్నారు. రాష్ట్రాల విషయంలో కేంద్రం జోక్యం చేసుకోదని, ఎవరిపట్ల వివక్ష చూపించదన్నారు. రాష్ట్రాలు కోరితేనే పరిశీలిస్తుందని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

  • Loading...

More Telugu News