: కేసులతో కేసీఆర్ బిజీబిజీ... వార్షిక రుణ ప్రణాళిక విడుదలకు డుమ్మా కొట్టారట!


ఓటుకు నోటు, ఫోన్ ట్యాపింగ్ వివాదాలు, ఉమ్మడి రాజధాని హైదరాబాదులో సెక్షన్ 8 అమలు అంశాలపై చర్చోపచర్చలు సాగిస్తున్న తెలంగాణ సీఎం కేసీఆర్ బిజీబిజీగా గడుపుతున్నారు. నిత్యం పోలీసు బాసులతో వరుస భేటీలు నిర్వహిస్తున్న ఆయన, ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ తోనూ తరచూ సమావేశమవుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ప్రభుత్వపరంగా పలు కీలక సమావేశాలను పక్కనబెట్టేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాష్ట్ర ఆర్థికాంశాల్లో వార్షిక రుణ ప్రణాళిక విడుదల కీలకమైనది. సాధారణంగా ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రులు తప్పనిసరిగా హాజరవుతారు. అన్ని బ్యాంకుల ఉన్నతాధికారులు హాజరయ్యే ఈ కార్యక్రమానికి రాష్ట్ర కేబినెట్ లోని అన్ని శాఖల మంత్రులు కూడా దాదాపుగా హాజరవడం తెలిసిందే. అయితే నిన్న తెలంగాణ వార్షిక రుణ ప్రణాళిక విడుదల కార్యక్రమానికి సీఎం కేసీఆర్ డుమ్మా కొట్టారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి మినహా మిగిలిన కేబినెట్ మంత్రులు ఎవరూ హాజరుకాలేదు. కీలక సమావేశంపై తెలంగాణ సర్కారు శీతకన్నేయడం చర్చనీయాంశంగా మారింది.

  • Loading...

More Telugu News